కొక్కెరకో!
‘కొక్కెర’.. కోళ్లలో కనిపించే అతి భయంకరమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ప్రబలితే.. 80-90 శాతం వరకూ కోళ్లు మరణించే ప్రమాదం ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కోళ్లను ఈ వ్యాధిబారి నుంచి కాపాడుకొనే అవకాశం ఉన్నది.
‘కొక్కెర’ వ్యాధికే ‘రాణికెట్’ అని పేరు. ఇది ఏ వయసు కోళ్లకైనా సోకుతుంది. ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన కోళ్లు, పిచ్చుకలు కూడా ఈ వైరస్ను రవాణా చేసే వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధిగ్రస్త కోళ్లు వేసే రెట్ట, వాటి కళ్లలోంచి కారే నీరు, చొంగ వల్ల కూడా ఆరోగ్యవంతమైన కోళ్లకూ వ్యాపిస్తుంది. పౌల్ట్రీ పరిశ్రమతోపాటు కోళ్ల పెంపకందారులు కోళ్లన్నిటికి ఒకే దగ్గర వసతి కల్పిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఒక్క కోడికి ఈ వ్యాధి వచ్చినా, కొద్ది రోజుల్లోనే తన సమీపంలోని కోళ్లన్నటికీ వ్యాప్తి చెందుతుంది. కొక్కెర వ్యాధిని కలిగించే వైరస్ ఇంక్యుబేషన్ వ్యవధి 5 నుంచి 7 రోజులు. ఒకటి, రెండు వారాల్లో వ్యాధి బహిర్గతం అవుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
లక్షణాలు
కొక్కెర వ్యాధి కోళ్ల శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాధికి గురైన కోళ్లు ఆకుపచ్చ రంగులో నీళ్ల విరేచనాలు చేసుకుంటాయి. కంటి, ముక్కు నుంచి నీరు కారుతుంది. ఎప్పుడూ దగ్గుతూ, రెక్కలు వేలాడదీసుకొని ఉంటాయి. గురక పెడుతూ, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతాయి. దాణా, నీళ్లు తీసుకోవు. ఫలితంగా నరాలు బలహీనంగా మారి, వణుకుతూ ఉంటాయి. రెక్కలు రాలి పోతాయి. కాళ్లు, మెడ వంకర్లు పోతాయి. పేగుల్లో పొరలు ఎర్రబడి, ‘అల్సర్’ లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగి, పక్షవాతం లక్షణాలతో మరణిస్తాయి. ఈ వ్యాధి సోకిన కోళ్లు బతికి బయటపడటం చాలా కష్టం. 80 నుంచి 90 శాతం వరకూ మరణిస్తాయి.
నివారణ
వ్యాధి సోకిన తర్వాత చేసే చికిత్స కన్నా, కొక్కెర సోకకుండా తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలే ఎంతో ముఖ్యం. నవంబర్, డిసెంబర్ నెలల్లో టీకాలు వేయిస్తే, కొక్కెర బారి నుంచి కోళ్లను కాపాడుకోవచ్చు. టీకాలు ఒక పద్ధతి ప్రకారం వేస్తారు. మొదటగా వారంలోపు పిల్లలకు ముక్కులో కానీ, కంట్లో కానీ వేస్తారు. తిరిగి అదే మందును ఎనిమిది వారాల తర్వాత వేస్తారు. మార్కెట్లో టీకా ఖరీదు చాలా తక్కువ. దగ్గర్లోని పశువైద్యశాలల్లో ఈ టీకాలను ఉచితంగానే అందిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

