Amanpreet Singh Gill | అండర్-19 సహచరుడి మృతి పట్ల కోహ్లీ సంతాపం.. !
Amanpreet Singh Gill : ఒకప్పుడు తనత కలిసి ఆడిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) మరణ వార్త విని షాకైన విరాట్.. మనసుకెంతో బాధగా ఉందని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపాడు.
Amanpreet Singh Gill : భారత మాజీ ఆటగాడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) అకాల మరణం పట్ల పలువురు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తనత కలిసి అండర్_19 క్రికెట్ ఆడిన అమన్‌ప్రీత్ మృతి పట్ల విరాట్ కోహ్లీ (Virat Kohli) సంతాపం తెలిపాడు. మరణ వార్త విని షాకైన విరాట్.. మనసుకెంతో బాధగా ఉందని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపాడు. 36 ఏళ్లకే అమన్‌ప్రీత్ కన్నుమూయడం తనను కలచివేసిందని విరాట్ భావోద్వేగానికి లోనయ్యాడు.
‘అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణించాడని తెలిసి షాకయ్యా. మనసుకెంతో బాధగా ఉంది. ఈ విషాద సమయంలో అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా. మిత్రమా నా ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి’ అని విరాట్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. చిన్న వయసులోనే అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణించడం పట్ల కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు సంతాపం తెలిపారు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఎక్స్‌లో స్పందిస్తూ.. అమన్‌ప్రీత్‌తో డ్రెస్సింగ్ రూమ్ జ్జాపకాలను గుర్తు చేసుకున్నాడు.
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti 🙏
— Virat Kohli (@imVkohli) May 7, 2026
‘అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణవార్త విని ఎంతో బాధ పడ్డాను. కెరీర్ ఆరంభంలో ఇద్దరం డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. అతడు మితభాషి. క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే అతడు చాలా కష్టపడేవాడు. అతడి కుటుంబ సభ్యలకు సానుభూతి తెలియజేస్తున్నా. అమన్‌ప్రీత్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి’ అని యువీ ఎక్స్ పోస్ట్ పెట్టాడు.
పంజాబ్‌కు చెందిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ అండర్-19లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ఆడిన అమన్‌ప్రీత్ 11 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఐపీఎల్ ఆరంభ సీజన్లో అప్పటి కింగ్స్ లెవన్ పంజాబ్‌కు ఆడిన అతడు.. అనంతరం పంజాబ్ క్రికెట్లోసెలెక్టర్గా కొనసాగాడు. ఉన్నట్టుండి అమన్‌ప్రీత్ మరణించడానికి కారణం ఏంటో అతుచిక్కడం లేదు.
Virat Kohli and Yuvraj Singh paid a heartfelt tribute to his U-19 teammate and former Punjab medium pacer Amanpreet Singh Gill, who died at the age of 36 on Wednesday, May 6. Gill’s untimely death has left the cricket fraternity in mourning.
Gill, a former Under-19 teammate of… pic.twitter.com/WqBFi5VS3H
— IndiaToday (@IndiaToday) May 7, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

