KL Rahul: 20 కోట్ల ఖరీదైన ఇళ్లు కొన్న కేఎల్ రాహుల్, అతియాశెట్టి జంట
KL Rahul: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన భార్య అతియా శెట్టి.. ముంబైలో కొత్తగా ఇంటిని ఖరీదు చేశారు. ఆ ఇళ్లు ఖరీదు సుమారు 20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాలీ హిల్ ఏరియాలో ఆ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నది.
ముంబై: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul), ఆయన భార్య అతియా శెట్టి.. ముంబైలో కొత్తగా ఇంటిని ఖరీదు చేశారు. ఆ ఇళ్లు ఖరీదు సుమారు 20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాలీ హిల్ ఏరియాలో ఆ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నది. విలాసవంతమైన ఆ ఇళ్లు.. బాంద్రా సమీపంలోనే ఉన్నది. సుమారు 3350 చదరపు ఫీట్ల ప్రాపర్టీ అది. సంధూ ప్యాలెస్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్లో ఆ ఇళ్లు ఉంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆ బిల్డింగ్‌కు పాక్షిక అనుమతి లభించింది.
ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో టాప్ సెలబ్రిటీలు, సంపన్న వ్యాపారాలు ఉంటారు. అక్కడ గజం స్థలం లక్షపైనే ఉంటుంది. అక్కడి వీధులు చాలా గ్రీన్‌గా, నిర్మానుషంగా ఉంటాయి. లగ్జరీ కోరుకునే వారికి ఇది అనువైన స్థలం. ఇళ్లు ఖరీదు చేసేందుకు ఆ జంట సుమారు కోటి 20 లక్షల స్టాంప్ డ్యూటీ కట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 30 వేలు చెల్లించారు. జూలై 15వ తేదీన ఇంటిని రిజిస్టర్ చేసుకున్నారు.
నాలుగు కార్లు పార్క్ చేసే స్థలం ఉంది. అత్యంత రద్దీగా ఉండే ముంబైలో ఇది కలిసివచ్చే అంశమే. కేఎల్ రాహుల్, అతియా శెట్టి తొలుత ఫ్రెండ్స్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రొమాన్స్ పుట్టింది. 2020లో ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్లు ఓపెన్ అయ్యారు. 2023 జనవరిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న వన్డే జట్టులో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

