మెల్బోర్న్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లను రనౌట్ చేసే సమయంలో గమ్మత్తు జరిగింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కవర్స్‌లోకి బంతిని కొట్టి ఒక పరుగు తీయాలని భావించాడు. కానీ నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న దేవాన్ కాన్వా మాత్రం ముందుకు కదలలేకపోయాడు. ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబ్బాట్‌కు నిజానికి బంతి దొరకలేదు. ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు పరుగు తీశారు. బాల్‌ను అందుకోవడంలో అబ్బాట్ మిస్ కావడంతో.. మళ్లీ ఇద్దరు బ్యాటర్లు స్ట్రయికర్ వైపు పరుగులు తీశారు. అయితే కీపర్ కేరీ బంతిని వికెట్లకు కొట్టడంలో విఫలం కావడంతో.. కివీస్ బ్యాటర్ విలియమ్సన్ తృటిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 196 టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 82 రన్స్‌కే ఆలౌటైంది.
Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD
— cricket.com.au (@cricketcomau) September 8, 2022