మహానటి, కళావతి రెండూ ఇష్టమే
దక్షిణాది ప్రేక్షకులను అందంతో పాటు అభినయంతో మెప్పించిన నాయిక కీర్తి సురేష్. హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అనే ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న కొద్ది మంది నాయికల్లో ఒకరామె. మహానటిగా మెప్పించాలన్నా, కళావతిగా ఆకట్టుకోవాలన్నా కీర్తి సమర్థురాలు. ఆమె మహేష్‌బాబు సరసన నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’ నేడు తెరపైకి వస్తున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన తన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది కీర్తి సురేష్.
మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది
నేనెలా నటించాను అని చూసినప్పుడు బోలెడు తప్పులు కనిపిస్తాయి. ఇది ఇంకా బాగా చేయాల్సింది కదా అనిపిస్తుంది. అందుకే ఖాళీ సమయాల్లో నా సినిమాల జోలికి వెళ్లాను. ఇంట్లో మా కుక పిల్ల నైకీతో ఆడుకుంటాను. ఫ్యామిలీతో కలసి కేరళ వెళ్తుంటాను.
కమర్షియల్ చిత్రాల్లో నాయికలకు అంత స్కోప్ ఉండదంటారు. ఈ సినిమాలో మీ పాత్ర ప్రాధాన్యత ఎలా ఉంటుంది?
కళావతి లాంటి పాత్ర ఇంతకుముందు చేయలేదు. అందుకే ఈ సినిమాలో నటించడం సంతోషంగా అనిపించింది. దర్శకుడు పరశురాం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత వుంటుంది. ఈ చిత్రంలోనూ కళావతి పాత్ర కీలకం. ఇంతపెద్ద కమర్షియల్ సినిమాలో అంతే ప్రాధాన్యత వున్న పాత్ర దకడం అదృష్టం. కథ విన్న వెంటనే ఓకే చెప్పా.
ఈ పాత్రలో కొత్తగా అనిపించింది ఏమిటి?
కళావతి క్యారెక్టర్ కొత్త కోణంలో వుంటుంది. మహానటిలో సావిత్రిగా దాదాపు అన్ని భావోద్వేగాలు పలికించాను. అయినా ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తాను. అది తెరపై మీరే చూస్తారు
మహేష్ బాబుతో కలిసి నటించడంపై మీ స్పందన
మహేష్ బాబుది సరదా వ్యక్తిత్వం. మొదట చూసినప్పుడు సీరియస్‌గా ఉంటారేమో అనుకున్నా గానీ సెట్లో బాగా నవ్విస్తుంటారు. మాటలే కాదు పాటల చిత్రీకరణ కూడా ఆస్వాదించాం. మాస్ పాటలో మాత్రం మహేష్ టైమింగ్‌ని పట్టుకోలేకపోయాను.
‘మహానటి’తర్వాత మాస్ సినిమాలకు దూరమయ్యాను అనుకున్నారా?
సావిత్రి బయోపిక్‌లో నేను నటించి మెప్పించగలను అని ముందు నేనే నమ్మలేదు. కానీ నా నటన మీ అందరికీ నచ్చింది. నటిగా అలాంటి సినిమాలు తరుచూ దొరకవు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నాను. తెలుగులో మాస్ చిత్రాలు చేయలేదు గానీ తమిళంలో అలాంటి అవకాశాలు వచ్చాయి.
తమిళంలో ఇటీవల మీరు నటించిన ‘సాని కాయిదమ్’, ఇప్పుడు తెలుగులో ‘సర్కారు వారి పాట’ రెండు భిన్నమైన చిత్రాలు కదా ఏది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది?
నేను సాని కాయిదమ్ లాంటి సినిమాలు చేయడానికి ఎంత ఇష్టపడతానో, సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ చిత్రాల్లో నటించడానికీ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాను. వేటికవి కొత్తగా ఉండే సినిమాల్లో నటించినప్పుడే నటిగా నాలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులు చూడగలరు. నాకు మహానటి, కళావతి రెండూ కావాలి.
రజినీకాంత్, చిరంజీవి లాంటి పెద్ద హీరోలకు సోదరిగా నటించడానికి సందేహించారా?
రజినీకాంత్, చిరంజీవి ఇద్దరు దిగ్గజ హీరోలు. వాళ్లతో తెర పంచుకునే అవకాశం రావడమే అరుదు. ఇప్పుడు చెల్లిగా నటిస్తే రేపు హీరోయిన్గా అవకాశం రాదని ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే ఈ అవకాశం కోల్పోతాను.
నానితో కలిసి నటిస్తున్న‘దసరా’చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఆ సినిమాలో నటనకు అవకాశమున్న పాత్రలో నటిస్తున్నాను. నా పాత్ర సహజంగా ఉంటుంది. స్థానిక యువతిగా కనిపిస్తాను.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

