హద్దులు దాటి నటించను!
ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నది అగ్ర తార కీర్తి సురేష్. గ్లామర్ పాత్రలు తన మొదటి ప్రాధాన్యం కానేకాదని చెప్పింది. కమర్షియల్ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వల్ల కాదంటున్నది. నటిగా గుర్తింపుతో పాటు విజయాలను ఆశిస్తున్నట్లు తెలిపింది. కీర్తి సురేష్ స్పందిస్తూ…‘నటిగా నా అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని కోరుకుంటాను. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న నాయిక పాత్రలే నాకు దక్కుతున్నాయి. వాటితోనే మీ ఆదరణ పొందుతున్నాను. నటిగా కమర్షియల్ సినిమాలతో పాటు ఆర్ట్ ఫిలింస్ చేయాలనుకుంటున్నాను. ఇలా బ్యాలెన్స్ చేయడం వల్ల పరిపూర్ణ నటిగా మీకు గుర్తుంటాను. తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. అవి దాటి నటించను’ అని చెప్పింది. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’, చిరంజీవితో ‘భోళా శంకర్’, నానికి జోడీగా ‘దసరా’ చిత్రాల్లో నటిస్తున్నది. మరిన్ని ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- cinema news
- Kirti Suresh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

