అమ్మలకూ పరీక్షే!
ఇది పరీక్షల సమయం. పరీక్షా సమయం. తెచ్చుకునే మార్కులు, సాధించే ర్యాంకులు.. తర్వాత సంగతి. అన్నిటికంటే ముందు పిల్లలు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి. అందుకు సరిపడా మద్దతు, అనువైన వాతావరణం కన్నతల్లే అందించాలి.
ఇది పరీక్షల సమయం. పరీక్షా సమయం. తెచ్చుకునే మార్కులు, సాధించే ర్యాంకులు.. తర్వాత సంగతి. అన్నిటికంటే ముందు పిల్లలు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి. అందుకు సరిపడా మద్దతు, అనువైన వాతావరణం కన్నతల్లే అందించాలి.
పోషకాలతోనే శరీరానికి బలం వస్తుంది. జలుబు, దగ్గు తదితర రుగ్మతలు ఇబ్బంది పెట్టవు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారాన్నే వడ్డించండి. తెల్లవారితే పరీక్ష అనగా.. పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకోవాలని ఆశించడం దురాశే. ఇది మంచి పద్ధతి కాదు. మెదడు అలసి పోతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కనీసం ఏడుగంటల నిద్ర లభించేలా చూడండి. కాఫీ,టీ ఎక్కువగా ఇవ్వకండి. అలా అని పూర్తిగా నిషేధించకండి.
గంటలకొద్దీ చదవకుండా.. మధ్యలో బ్రేక్ తీసుకునేలా ప్రోత్సహించండి. ఆ వ్యవధిలో తినడానికి ఏమైనా పెట్టండి. ప్రతి పరీక్ష తర్వాతా పోస్ట్మార్టమ్ అవసరం లేదు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపండి. స్నేహితుల్లా వ్యవహరించండి. ఫలితాల గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోకుండా.. తమవంతు ప్రయత్నం చేయమని సలహా ఇవ్వండి. వాళ్లతోపాటు మీరూ మేల్కొని ఉండాలనుకోవడం పిచ్చితనమే. మీరు ఆరోగ్యంగా ఉంటేనే.. పిల్లల పనులు సజావుగా సాగుతాయి.
ఈ సమయంలో వాళ్లకు క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయ పాలన.. వగైరా పాఠాలు బుర్రకెక్కించే ప్రయత్నం వద్దే వద్దు. గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉండనివ్వండి. మంచినీళ్లు అందుబాటులో ఉంచండి. తరచూ జావ, మజ్జిగ, పళ్లరసాలు ఇస్తూ ఉండండి. వేసవిలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఆకలి లేకపోవడం, అతినిద్ర, నిద్రలేమి, నెగెటివ్ వ్యాఖ్యానాలు.. డిప్రెషన్ సంకేతాలు కావచ్చు. గమనిస్తూ ఉండండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

