సొసైటీలోనూ కల్తీ ఎరువులేనా.. పొటాష్‌కు రెడ్ ఆక్సైడ్ రంగు!
కరువు కాలంలో వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఓ వైపు నానా తంటాలు పడుతుంటే.. కల్తీ ఎరువులు పంట చేతికి రాకుండా చేస్తున్నాయి. సహకార సంఘంలో కొనుగోలు చేసిన ఎరువు బస్తాల్లోనే కల్తీ జరుగుతుంటే వ్యవసాయాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆందోళన చెందుతున్నాడు.
- ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లిలో ఓ రైతు ఆవేదన
బోనకల్లు, అక్టోబర్ 19 : కరువు కాలంలో వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఓ వైపు నానా తంటాలు పడుతుంటే.. కల్తీ ఎరువులు పంట చేతికి రాకుండా చేస్తున్నాయి. సహకార సంఘంలో కొనుగోలు చేసిన ఎరువు బస్తాల్లోనే కల్తీ జరుగుతుంటే వ్యవసాయాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆందోళన చెందుతున్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చావా జనార్దన్‌రావు తనకున్న పది ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట పొట్ట దశకు చేరడంతో గింజ గట్టి పడటానికి పొటాష్ అవసరమని భావించాడు. స్థానిక సహకార సంఘంలో ఒక్కో బస్తాకు రూ.2,200 చొప్పున నాలుగు బస్తాల పొటాష్ కొనుగోలు చేశాడు. కూలీలు పొలంలో ఎరువు చల్లుతుండగా అక్కడే ఉన్న రైతు జనార్దన్‌రావు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
బస్తాల్లో తెల్లగా ఉండాల్సిన ఎరువు రెడ్ ఆక్సైడ్ మాదిరిగా ఎర్రగా చేతులకు అంటుతున్నది. కూలీలు నీటిలో చేతులు కడిగినా ఎంతకూ జిడ్డు వదలకపోవడంతో రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. కల్తీ ఎరువులు వేస్తే పంట చేతికొస్తుందా? అని ఆవేదన చెందుతున్నాడు. చేతులకు అంటుకున్న రంగు, ఎరువు తీరును ఫొటోలు తీసి మధిర ఏడీఏ, వ్యవసాయ అధికారులకు పంపినా కనీసం స్పందించలేదని వాపోయాడు. సొసైటీలో కొనుగోలు చేసిన ఎరువులే ఇలా ఉంటే.. బయట కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తక్షణమే ఉన్నతాధికారులు బ్రాహ్మణపల్లికి వచ్చి ఎరువు బస్తాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాలని, బాధ్యులైన డీలర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

