Khadgam Movie | ఖడ్గం(Khadgam). కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002 నవంబర్ 29వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీకాంత్ (Srikanth), రవితేజ (Raviteja), ప్రకాశ్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే చాలు జెమిని టీవీ (Gemini Tv) ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆగష్టు 15 రోజు ఏ మూవీ వస్తుందని అడిగితే.. ఖడ్గం సినిమా అని టక్కున చెబుతారు. అంతలా టీవీ ఆడియన్స్ను ఇంపాక్ట్ చేసింది ఈ సినిమా. కాగా రేపు ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం ఈ సందర్భంగా జెమిని టీవీ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఖడ్గం సినిమాను రేపు 8.30 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
“రేపు ఆగష్టు 15. మా ఆనవాయితీని మళ్ళీ కొనసాగిస్తున్నాం.. మీరు జెండా ఎగరేసి, లడ్డు తినేసి, త్వరగా ఇంటికి వచ్చి ” ఖడ్గం ” మూవీ చూసేయండంటూ” జెమిని టీవీ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది. ఈ పోస్టు చూసిన నెటిజెన్లు నాకు తెలుసు మళ్ళీ ఇదే సినిమా వేస్తావని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మా ఆనవాయితీ కొనసాగిస్తున్నాం ..మీరు జెండా ఎగరేసి , లడ్డు తినేసి , త్వరగా ఇంటికి వచ్చి ” ఖడ్గం ” మూవీ చూసేయండి .
Khadgam | Aug 15 | 8:30 AM #Raviteja #Prakashraj #Sangeetha #Srikanth #DSP #independanceday pic.twitter.com/ZQIUfc316A— Gemini TV (@GeminiTV) August 14, 2023