త్రిసూర్ : దైనందిన పని జీవితంలో కాసేపు విరామం, ఆహ్లాదం, ఆటవిడుపు వంటివి ఉంటే తిరిగి పునరుత్తేజంతో పనిచేస్తుంటాం. ఈ కరోనా మహమ్మారి సమయంలో వైద్య వృత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైరస్ వ్యాప్తి నిరోధానికి, పాజిటివ్ రోగులకు చికిత్స అందించడంలో తీరిక లేకుండా వృత్తి ధర్మంలో నిమగ్నమై ఉంటున్నారు వైద్యులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు మెడికోలు తమ అందమైన డ్యాన్స్‌తో నెటిజన్స్ హృదయాలను కొల్లగొట్టారు.
కేరళలోని త్రిసూర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు బోనీ ఎం బృందం పాడిన రాస్పుటిన్ పాటకు సూపర్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను మెడికల్ డివైసెస్ కన్సల్టెంట్ అయిన జుడిష్ రాజ్ అనే వ్యక్తి ైస్టెలిష్ డ్యాన్స్ మెడికోస్ అనే క్యాప్షన్‌తో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మూడో ఏడాది చదివే జానకి ఎం ఓంకుమార్, నాలుగో ఏడాది చదివే నవీన్ కె రజాక్ ఇరువురు ఈ డ్యాన్స్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 1,51,500 మంది వీక్షించారు. 5,800 మంది లైక్ చేయగా, 877 మంది రీట్వీట్ చేశారు.