కర్ణాటకలోనూ కంప్లీట్ లాక్డౌన్!.. క్లారిటీ ఇచ్చిన సీఎం
కర్ణాటకలో కంప్లీట్ లాక్డౌన్!.. క్లారిటీ ఇచ్చిన సీఎం | గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది.

బెంగళూరు : గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది. మహమ్మారి కట్టడికి కఠిన లాక్డౌన్ విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాల్సి ఉంటుందన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ప్రజలు నియమాలు పాటించడం లేదు. కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు వెళ్లడం అనివార్యం కావొచ్చు. మేం రెండు రోజుల్లో నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే రోజువారీ కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 49,058 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం 50వేల మార్క్‌ను దాటాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ సైతం పెరిగింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొవిడ్ రోగులను సహాయం కోసం తన నివాసం వద్దకు తీసుకురావొద్దని సూచించారు. గురువారం పలువురు కొవిడ్ రోగులను సీఎం ఆఫీసు వద్దకు తీసుకువచ్చి ఆసుపత్రిలో బెడ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ అధికారులు సహాయం అందిస్తారని, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానన్నారు. మేం మీతోనే ఉన్నామని.. దయ చేసి రోగులను విధాన సౌధకు, నివాసానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్‌గఢ్ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
కరోనా నుంచి కోలుకున్నారా? ఇలా చేయకుంటే మళ్లీ సోకే అవకాశం!
కేంద్రం వైఫల్యంతోనే మరోసారి లాక్డౌన్ పరిస్థితులు : రాహుల్ గాంధీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

