చెడు నుంచి మంచి వైపు..

కథానాయకుడు కల్యాణ్‌రామ్ తన కెరీర్లో తొలిసారి చారిత్రక పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. త్రిగర్తాల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా ఆయన అత్యంత శక్తివంతమైన పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. ‘బింబిసార’గా కల్యాణ్‌రామ్ టైటిల్‌రోల్‌ని పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హరికృష్ణ కె నిర్మాత. సోమవారం ట్విట్టర్ వేదికగా కల్యాణ్‌రామ్ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి ‘ఏ టైమ్ ట్రావెల్ ఈవిల్ టు గుడ్’ అనే క్యాప్షన్‌ను జత చేశారు.
‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే, ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తలా సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకచత్రాధిపత్యం’ అనే శక్తివంతమైన సంభాషణతో టీజర్ సాగింది. చరిత్ర, వర్తమానం మధ్య సంబంధాన్ని కలుపుతూ రాసుకున్న కథగా టీజర్‌ను చూస్తే అర్థమవుతున్నది. చివరలో హీరో కల్యాణ్‌రామ్ ఆధునిక యువకుడిగా విలన్స్‌తో తలపడటం కనిపించింది. ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్యాణ్‌రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంగీతం: చిరంతన్ భట్, డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్: సంతోష్ నారాయణ్, ఎడిటర్: తమ్మిరాజు, మాటలు: వాసుదేవ్ మునెప్పగారి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, నిర్మాణ సంస్థ: నందమూరి తారక రామారావు ఆర్ట్స్, రచన-దర్శకత్వం: వశిష్ట్.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bimbisara
- kalyan ram
- Vashist
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

