నన్ను చూసి కాజల్ భయపడింది!
‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. పాత్రల పరంగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటా’ అని అన్నారు నవీన్‌చంద్ర. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నవీన్‌చంద్ర పాత్రికేయులతో ముచ్చటించారు.
ఐటీస్కామ్ ఆధారంగా
నటుడిగా మంచి కథల్లో భాగమవ్వాలన్నదే నా అభిలాష. ఎన్నో ఏళ్లు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడే నా కెరీర్ గాడిన పడింది. మంచి అవకాశాలు వరిస్తున్నాయి. యథార్థంగా జరిగిన ఓ ఐటీస్కామ్ ఆధారంగా రూపొందిన చిత్రమిది. కాజల్, విష్ణులకు కజిన్‌గా ఈ సినిమాలో నేను కనిపిస్తా. పోలీసుల్ని, వ్యవస్థను ఎదురించి తనవారిని రక్షించుకోవాలనే మనస్తత్వమున్న యువకుడిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. మత్తు పదార్థాలకు అలవాటుపడిన దొంగగా క్రూర మనస్తత్వంతో సాగుతుంది. పాత్రలో నా హావభావాలు, కోపం చూసి కొన్ని సార్లు షూటింగ్ సమయంలో కాజల్ భయపడింది. అంతలా లీనమైపోయి నటించా.
యూవీ కాన్సెప్ట్‌లో..
కథే హీరోగా నమ్ముతూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తా. సక్సెస్‌కు ప్రామాణికంగా బాక్సాఫీస్ నంబర్స్‌ను పరిగణిస్తుంటారు. నేను మాత్రం ఆ సమీకరణాల్ని పట్టించుకోను. కమర్షియల్ సినిమాలకు ప్రాముఖ్యతనిస్తే మంచి పాత్రలకు దూరమవుతాననే భయం ఉంది. ప్రస్తుతం తెలుగులో యూవీ కాన్సెప్ట్, లక్కీ మీడియా సంస్థలు నిర్మిస్తున్న చిత్రాల్లో హీరోగా నటిస్తున్నా. అర్ధశతాబ్దం, గని, విరాటపర్వంతో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- kajal
- mosagallu
- naveen chandra
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

