ప్రతీకార కథ

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. యూరప్‌లోని సుందర ప్రదేశాల్ని తిలకిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7న ప్రేక్షకులముందుకురానుంది. తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితాలకు ఫిక్షనల్ అంశాలను జోడిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాతే కొత్త చిత్రాల్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ‘జనతా గ్యారేజ్’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ప్రతీకార కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని, మాస్ అంశాలతో పాటు సామాజిక సందేశం మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్‌లో మొదలుకానున్నదని అంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

