BC Gurukuls | బీసీ గురుకులాల్లో జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
BC Gurukul Schools | పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 22వ తేది నుంచి ఆన్లైన్లో https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter లో అప్లై చేసుకోవాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 12 వ తేదీ చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు
BC Gurukul Schools | గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఐఎఫ్ఎస్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈనెల 22వ తేది నుంచి ఆన్లైన్లో https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter లో అప్లై చేసుకోవాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.
దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 12 వ తేదీ చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్మీడియట్ లో రెగ్యులర్ 5 గ్రూప్ లు MPC, BiPC , MEC ,CEC , HEC లతో పాటు 7 గ్రూప్ ల వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ కోర్స్) 1) అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్, 2) కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్, 3) ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, 4) కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, 5) మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (MPHW), 6) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, 7) ఫిజియోథెరపీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రెగ్యులర్ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 146 కాలేజీ లలో బాలురకు 12,640 సీట్లు, 144 కాలేజీ లలో బాలికలకు 12,080 సీట్లు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని సెక్రటరీ వెల్లడించారు. బీసీ గురుకులాల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తమ స్కూల్ ప్రిన్సిపాల్స్ కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23328266 లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Read Also :
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

