హైదరాబాద్: డిజిటల్ రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (Digital India Corporation) ఆహ్వానం పలుకుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులకు డీఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్/డెవోప్స్ లీడ్, డేటా ఇంజినీరింగ్, క్యూఏ/టెస్ట్ ఇంజినీర్, డేటా అనలిస్ట్ పోస్టులకు బీఈ/బీటెక్ (BE/B.Tech) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అభ్యర్థులకు ఆయా పోస్టులకు సంబంధించిన టెక్నికల్ నైపుణ్యం, పని అనుభవం కలిగి ఉండాలి. అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదీ జూలై 26. దరఖాస్తు, ఇతర వివరాలకు https://negd.gov.in/ వెబ్సైట్లో చూడండి.