జాతస్య మరణం ధ్రువం
జె.డి.చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్‌రోల్స్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ప్రీతి జింఘానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
జె.డి.చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్‌రోల్స్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ప్రీతి జింఘానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా టైటిల్‌ని సజెస్ట్ చేసింది తానేనని, ఆ క్రెడిట్ తనకే వస్తుందని, నిర్మాత మల్కాపురం శివకుమార్ పాషన్ ఉన్న నిర్మాత అని, రాజీ పడకుండా సినిమా చేశారని, అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని జె.డి.చక్రవర్తి చెప్పారు. కంటెంట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ఇదని హీరో నరేష్ అగస్త్య అన్నారు. స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ప్రతి అడుగులో జెడీ చక్రవర్తి తమకు సపోర్ట్ చేశారని దర్శకుడు శ్రవణ్ పేర్కొన్నారు. ‘కథను నమ్మి చేసిన సినిమా ఇది. జె.డి.చక్రవర్తి, నరేశ్, సీరత్ కపూర్ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నాం’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

