ఎంత చెట్టుకు అంత గాలి అనీ.. ఎవరి కష్టాలు వాళ్లకుంటాయి. వాటన్నింటినీ నెగ్గుకొని ముందుకెళ్లడమే జీవితం. ఈ విషయం అందాలభామ జాన్వీకపూర్‌కి బాగా అర్థమైనట్టుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు అందుకు అద్దంపడుతున్నాయి. ‘సూపర్‌స్టార్‌కి కూతురుగా పుట్టడం అందరూ అదృష్టం అంటుంటారు. నిజంగా అదృష్టమే. కానీ దాని వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా సామాన్యంగా ఉండవు. స్కూల్‌డేస్‌లో నన్నందరూ ప్రత్యేకంగా చూసేవాళ్లు.
నేను వాళ్లతో కలిసిపోడానికి ఎంతో కష్టపడ్డాను. ఓ సారి పదేళ్ల వయసులో నా ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. త్వరలో తెరంగేట్రం చేయబోతున్నానని ఆ ఫొటోలను ప్రచురించారు. అంతే.. ఇక స్కూల్లో అందరూ నన్ను దూరం పెట్టారు. నాపై నా ఫ్రెండ్సే జోకులేయడం స్టార్ట్ చేశారు. ‘ఇండస్ట్రీలో నువ్వు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకీ స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావ్?’ అంటూ ఎటుచూసినా వెటకారపు ప్రశ్నలు. ఆ టైమ్‌లో నేను అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేను. హీరోయిన్ అయ్యాక నా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్స్‌లో పెట్టారని తెలిసి ఎంత ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు”అంటూ చెప్పుకొచ్చింది జాన్వికపూర్.