టెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో అతను ఈ ఘనతను అందుకున్నాడు. కివీస్ ప్లేయర్ టామ్ లాథమ్‌ను ఔట్ చేసిన అండర్సన్ .. టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 650 వికెట్ల ల్యాండ్‌మార్క్‌ను దాటిన మూడవ బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. స్పిన్ మాంత్రికులు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లు ఈ మైలురాయిని దాటేశారు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ టూర్‌కు దూరమైన అండర్సన్ మళ్లీ జట్టులో కలిశాడు.