Jalalabad motorcycle blast | జలాలాబాద్ బైక్ పేలుడు తీవ్రవాద చర్య : పంజాబ్ పోలీసులు
Jalalabad motorcycle blast | జలాలాబాద్ బైక్ పేలుడు తీవ్రవాద్ర చర్యగా పంజాబ్ పోలీసులు అభివర్ణించారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఫవీల్కా జిల్లా ధర్ముపుర గ్రామానికి చెందిన పర్వీన్కుమార్గా గుర్తించినట్లు చెప్పారు. గ్రామం భారత్ - పాక్ సరిహద్దుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 15న ఫజిల్కాలోని జలాలాబాద్‌లో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి బల్వీందర్ సింగ్ (22) అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే.

చండీగఢ్ : జలాలాబాద్ బైక్ పేలుడు తీవ్రవాద్ర చర్యగా పంజాబ్ పోలీసులు అభివర్ణించారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఫవీల్కా జిల్లా ధర్ముపుర గ్రామానికి చెందిన పర్వీన్కుమార్గా గుర్తించినట్లు చెప్పారు. ఈ గ్రామం భారత్ – పాక్ సరిహద్దుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 15న ఫజిల్కాలోని జలాలాబాద్‌లో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి బల్వీందర్ సింగ్ (22) అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే. విచారణలో రద్దీగా ఉండే ప్రాంతంలో మోటార్ సైకిల్‌ను పేల్చేందుకు కుట్ర పన్నిన పర్వీన్ కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
కుమార్ పాత్రపై వివరాలు తెలుసుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న ఆధారంగా ఫజిల్క పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఫిరోజ్‌పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) జతిందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో బల్వీందర్ నడిపిన బైక్ జలాలాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పార్క్ చేయాల్సి ఉందని కుమార్ చెప్పాడని పేర్కొన్నారు. ఈ నెల 14న ఫిరోజ్‌పూర్ చండీవాలా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అలియాస్ సుఖ ఇంట్లో ఈ ‘టెర్రర్ యాక్ట్’ కోసం ప్లాన్ చేసినట్లు కుమార్ వెల్లడించాడని ఐజీపీ చెప్పారు. మమ్దోత్లోని లఖ్మీర్ కే హిత్తర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్ సైతం ఈ ప్లాన్‌లో భాగమని తెలిపారు.
పోలీసులు సేకరించిన సమాచారం ఆధారంగా బల్వీందర్ సహా నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామని, సుఖ్వీందర్, గుర్ప్రీత్లను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. నలుగురు నిందితులకు నేర నేపథ్యం ఉందని పేర్కొన్నారు. ఓ రైతు సమాచారం మేరకు నిందితుడు కుమార్ పొలాల్లో దాచిన టిఫిన్ బాంబును సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆగస్ట్ 8న అమృత్సర్ రూరల్ పోలీసులు లోపాక్లోని దలేకే గ్రామం నుంచి ఐదు హ్యాండ్ గ్రనేడ్లు, టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 20న కపుర్తల పోలీసులు ఫగ్వారా నుంచి రెండు హ్యాండ్ బాంబ్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఆగస్ట్ 8న అజాల్నాలో ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేందుకు మరో టిఫిన్ బాంబు వినియోగించారని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

