హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనా విధానం ఫలితంగా హైదరాబాద్ నగరం భారతదేశానికే అత్యంత సస్యశ్యామలమైన, నిరంతర శక్తిమంతమైన స్టార్టప్ రాజధానిగా రూపాంతరం చెందిందని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. టీ-హబ్ 11 ఏళ్ల విజయవంతమైన సందర్భంగా మాట్లాడారు. 2014-2023 మధ్య కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కేవలం పారిశ్రామిక ప్రగతి మాత్రమే కాదని, నాయకత్వం , స్పష్టమైన విధానం , లక్ష్య సాధన అనే మూడు ప్రధాన సూత్రాలు సరిగ్గా కలిస్తే ఒక రాష్ట్రం ఎలాంటి విజయాన్ని సాధించగలదో ప్రపంచానికి నిరూపించిందని జగన్ మోహన్ రావు తెలిపారు. కేటీఆర్ ప్రతిపాదించిన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ మంత్రంతో ఇంతటి ప్రగతి సాధ్యమైందన్నారు.
ప్రజా సంక్షేమానికి సాంకేతికత, సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే, అది సమాజానికి మేలు చేసేలా ఉండాలనేది నేత కెసిఆర్ ఆశయమని కొనియాడారు. నవకల్పనల వేదికగా టీ-హబ్ & టీ-వర్క్స్ 2015లో ప్రారంభమైన టీ-హబ్ 1.0, ఆ తర్వాత 2022లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా అవతరించిన టీ-హబ్ 2.0 తో పాటు, దేశంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్ కేంద్రం టీ-వర్క్స్ లతో హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రంగా మారిందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఈవీ రవాణా, డ్రోన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్, 3D ప్రింటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగాల్లో యువ ఆవిష్కర్తలకు ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, భాగస్వామ్య ఆవిష్కరణల ద్వారా తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

