సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. యూట్యూబ్ లో రికార్డులు తిరగ రాస్తున్నాయి. ఇప్పటికే సాయి పల్లవి చిందేసిన రౌడీ బేబీ 1 బిలియన్ వ్యూస్ అందుకుంది. ఫిదా, ఎంసీఏ సినిమాలోని పాటలు కూడా సంచలనం సృష్టించాయి. ఈ కోవలోనే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట గత వారం రోజులుగా యూట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ జానపద గేయానికి జై కొడుతున్నారు. అయితే ఈ పాటపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.
సాధారణంగా జానపద గేయాలు సినిమాలో తీసుకున్నప్పుడు ఒరిజినల్ సింగర్ నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్లకు కు క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. ఇప్పుడు ‘సారంగ దరియా..’ పాటపై కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి అనే జానపద గాయని. సారంగదరియా పాట అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాని.. ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్ తన సొంతమని చెప్తుంది ఈమె.
అప్పట్లో స్టార్ మా లో వచ్చిన రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్ తేజ తన పాట విన్నాడని.. ఇప్పుడు లవ్ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్ తేజకు ఫోన్ చేశానని చెప్పింది కోమలి. ఇది ఎవరి సొంతం కాదు.. నువ్వు పుట్టక ముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడని చెప్పుకొచ్చింది ఈమె. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదని తెలిపింది. సినిమాలో ఈ పాట తనతో పాడించనందుకు బాధేసిందని.. తన బాధను చూసి నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారని చెప్పింది కోమలి. కానీ ఈ పాట విషయంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఇవ్వాల్సిన పేరు ఇవ్వలేదని కోమలి మీడియా ముందు చెప్పింది. మరి ఈ వివాదానికి సాఫ్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- komali
- Love story
- Sai Pallavi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

