Health tips | కడుపుబ్బరం ఇబ్బంది పెడుతోందా.. అయితే మీ వంటల్లో ఇది తప్పక ఉండాల్సిందే..!
Health tips : ఇంగువ ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. పప్పు, పప్పుచారు, పులిహోరతోపాటు వివిధ రకాల నిలువ తొక్కుల్లో కూడా ఇంగువను వాడుతారు. ఇంగువను వాడటంవల్ల ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఇవేగాక ఇంగువతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు..
1. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2. ఇంగువ పొడిలో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి.
3. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి కూడా ఇంగువ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకోసం మహిళలు బెల్లంలో బఠానీ గింజంత ఇంగువ పెట్టుకుని తినాలి.
4. తరచూ తలనొప్పితో బాధపడేవాళ్లు ఒక కప్పు మరిగించిన నీళ్లలో చిటికెడు ఇంగువ వేసి రోజుకు రెండు మూడుసార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది.
5. పిల్లలకు కడుపులో నులి పురుగులు ఉంటే సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తినిపించాలి. మంచి ప్రయోజనం ఉంటుంది.
6. రోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువను కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తీరిపోతాయి.
గమనిక : అయితే ఇంగువను పరిమితంగా వాడితేనే ప్రయోజనకారిలా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?