న్యూయార్క్ : మూడు నెలల పాటు నీటిలో మునిగిన ఐఫోన్ 12 (iPhone 12) బయటపడిన అనంతరం ఆపై సరిగ్గా పనిచేస్తుండటం అబ్బురపరుస్తోంది. ఉత్తర కాలిఫోర్నియా స్టానిస్లాస్ నదిలో మూడునెలల కిందట పడిపోయిన ఐఫోన్ 12 ఇటీవల నదిని శుభ్రం చేస్తున్న క్రమంలో పైకి తేలింది.
మూడు నెలల పాటు నీటిలో మునిగినా అది పర్ఫెక్ట్ కండిషన్‌తో ఉండటం దాని మన్నికను వెల్లడిస్తోంది. నదిని ప్రక్షాళన చేసేందుకు ఉపక్రమించిన డైవర్ లీ నవంబర్ 10న నీటిలో ఐఫోన్ 12 కనిపించింది. ఆరు రోజుల పాటు ఎయిర్ డ్రైయింగ్ ప్రక్రియ చేపట్టిన అనంతరం లీ ఈ డివైజ్‌ను చార్జర్‌కు కనెక్ట్ చేశాడు. ఫోన్‌కు పాస్‌కోడ్ లేకపోవంంతో ఇటీవలి ఫొటోలు, కాంటాక్ట్స్‌ను లీ యాక్సెస్ చేయగలిగాడు.
ఇదే నదిలో సెప్టెంబర్ 4న తీసిన రీసెంట్ వీడియో కూడా ఉంది. ఐఫోన్ 12లో ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్ ద్వారా దీని యజమానిని సంప్రదించేందుకు లీ ప్రయత్నిస్తున్నాడు. మూడు నెలల పాటు నీటిలో మునిగినా ఈ డివైజ్ సరిగ్గా పనిచేయడం యాపిల్ ఇంజనీరింగ్ ప్రమాణాలకు అద్దం పడుతున్నది.
Read More :