న్యూఢిల్లీ : తక్కువ మొత్తం వెచ్చించి ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి హాట్ డీల్ ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 12 తాజాగా భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ డివైజ్‌ను కేవలం రూ . 35,000లోపు సొంతం చేసుకోవచ్చు. ఈకామర్స్ ప్లాట్‌ఫాంపై ఐఫోన్ 12 రూ .48,900కు లిస్టవగా అర్హత కలిగిన బ్యాంక్ కార్డు, పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇక ఐఫోన్ 12 ఒరిజినల్ ధర రూ .59,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై ఈ హాట్ డివైజ్ రూ 48,999కి లిస్టయింది. ఫెడరల్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు రూ .1500 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ 15,000 వరకూ వచ్చే అవకాశం ఉండటంతో ఐఫోన్ 12ను కేవలం రూ . 33,999కే సొంతం చేసుకునే వీలుంది.
ఐఫోన్ 12 ఫీచర్లను చూస్తే..6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో నెక్ట్స్ జనరేషన్ న్యురాల్ ఇంజన్ ప్రాసెసర్‌తో ఏ14 బయోనిక్ చిప్సెట్తో ఈ డివైజ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో 12 ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, 4కే డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్, భద్రత కొరకు ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ను కలిగిఉంది. ఇక ఐఫోన్ 12, ఐఫోన్ 13ల మధ్య డిజైన్‌లో ఎలాంటి వ్యత్యాసం లేకపోవడంతో తక్కువ ధరలో ఐఫోన్ 12 దక్కించుకోవడం మెరుగైన అవకాశమే.