‘విడుదలైన అన్ని చోట్ల సినిమాకు చక్కటి స్పందన లభిస్తున్నది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది’ అని అన్నారు ఉదయ్‌కిరణ్. ఆయన నిర్మించిన ‘ఛలో ప్రేమిద్దాం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయిరోనక్, నేహాసోలంకి జంటగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పాటలు, కామెడీ సినిమాకు ప్లస్ అని అంటున్నారు. కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతున్నాయని చెబుతున్నారు. తొలి సినిమా అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించానని ప్రశంసిస్తున్నారు’ అని తెలిపారు. తన నటనకు మంచి పేరు లభిస్తుండటం ఆనందంగా ఉందని సాయిరోనక్ పేర్కొన్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయమిదని నటుడు అదుర్స్ రఘు చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్షఖాన్, జబర్దస్త్ పవన్ తదితరులు పాల్గొన్నారు.