అబ్బ.. కమలాసన్!
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్ ఆటగాడు గుల్బాదిన్ నయీబ్ ‘ఉత్తుత్తి గాయం’పై వివాదం నెలకొంది.
- గుల్బాదిన్ ‘ఉత్తుత్తి గాయం’పై ఆటాడుకున్న నెటిజన్లు
కింగ్స్టౌన్: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్ ఆటగాడు గుల్బాదిన్ నయీబ్ ‘ఉత్తుత్తి గాయం’పై వివాదం నెలకొంది. హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్ సూచనల మేరకు స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. అప్పటి దాకా బాగానే ఉన్నా ఏదో మంత్రం వేసినట్టుగా కింద పడిపోవడం, ఆ తర్వాత ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లడం, ఆ వెంటనే వర్షంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోవడం, మళ్లీ కొద్దిసేపటికే గుల్బాదిన్ తనలో ఉసేన్ బోల్ట్ పూనినట్టు వేగంగా పరుగెత్తడం చూస్తే అదేదో సినిమాలో చెప్పినట్టు ‘అంతా కమ్ అండ్ గో’లా జరిగిపోయాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేస్తున్న నూర్ అహ్మద్.. 4 బంతి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో చిన్నగా చిరుజల్లులు పడుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి అఫ్గాన్ డగౌట్ నుంచి ట్రాట్.. ‘వర్షం వచ్చేట్టు ఉంది. స్లో డౌన్ స్లో డౌన్’ అంటూ సైగ చేశాడు. కోచ్ సైగలు పసిగట్టిన గుల్బాదిన్.. ‘అయ్యో.. నా కండరాలు పట్టేశాయి. నేనిక నడవలేను!’ అనేంత రేంజ్లో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి గుల్బాదిన్ ‘తెచ్చిపెట్టుకున్న గాయాని’కి చికిత్స చేసేందుకు అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లి డ్రామాను మరింత రక్తి కట్టించాడు.
గుల్బాదిన్ కిందపడిపోయే సమయానికి బంగ్లా స్కోరు 81/7గా ఉండగా వర్షం వస్తే మ్యాచ్ ఆగిపోతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆ జట్టు విజయానికి రెండు పరుగుల దూరంలో ఉంది. ఈలోగా చిరుజల్లులు పెద్దవవడంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. ఏదేమైనా గుల్బాదిన్ చేసిన ఈ పనికి మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్తో పాటు భారత స్పిన్నర్ అశ్విన్ ఎక్స్‌లో సెటైర్లు సంధించారు. ఇక నెటిజన్లు అయితే ‘ఆస్కార్ లెవల్ యక్టింగ్’ అంటూ మీమ్స్, ట్రోల్స్‌తో గుల్బాదిన్‌ను ఆటాడుకున్నారు. ‘అబ్బ కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయన్న స్టయిల్లో’ అఫ్గాన్ మ్యాచ్ ముగిశాక ఇదే గుల్బాదిన్.. స్టేడియం అంతా కాళ్లల్లో స్ప్రింగులు వేసుకున్నాడా? అన్న చందంగా పరుగెత్తడం కొసమెరుపు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

