44 దేశాల్లో వ్యాపించిన భారత్ రకం వైరస్

జెనీవా: కోవిడ్ రోజుకో అవతారం ఎత్తుతున్నది. తన అంతర్నిర్మాణాన్ని మార్చుకుని ఉగ్రరూపం దాల్చుతున్నది. చైనారకంతో మొదలైన తర్వాత, బ్రిటన్, బ్రెజిల్, ఆఫ్రికా రకాలు వచ్చాయి. ఇప్పుడు భారత్ రకం ప్రపంచమంతటా విజృంభిస్తున్నది. ఈ వైరస్ 44 దేశాల్లో కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనికి శాస్త్రీయంగా బీ.1.617 అని పేరుపెట్టారు. గత అక్టోబర్ లో ఇది మొదటిసారి కనిపించింది. భారత్ వెలుపల బ్రిటన్‌లో అత్యధికంగా ఈ వైరస్ ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకం వైరస్‌పై సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్తరకం మూల వైరస్ కన్నా భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ఒకరి నుంచి మరొకరికి సత్వరమే వ్యాపించడం, తీవ్రస్థాయిలో అస్వస్థత కలిగించడం, లేదా టీకాకు లొంగకపోవడం అనేవి ఈ వైరస్ లక్షణాలుగా భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఈ లక్షణాల గురించే. అనేక దేశాల్లో కోవిడ్ కేసుల్లో ఒక్కసారిగా పెచ్చరిల్లడానికి ఈ వైరసే కారణం. 130 కోట్ల జనాభా కలిగిన భారత్ కోవిడ్ కేసుల్లో అమెరికా తర్వాతి స్థానానికి వచ్చింది. రోజుకు 3 లక్షల పైచిలుకు కొత్త కేసులతో, దాదాపు 4 వేల మరణాలతో వైద్యవ్యవస్థ సామర్థ్యాన్ని ఈ వైరస్ పరీక్షకు గురిచేస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

