భారత్‌లో తగ్గిన సంతానోత్పత్తి రేటు
న్యూఢిల్లీ: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) కీలక నివేదికను రిలీజ్ చేసింది. దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయినట్లు ఆ రిపోర్ట్ పేర్కొన్నది. ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తన నివేదికలో స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా జనాభా నియంత్రణకు దోహదపడనున్నది. ఓ మహిళ వల్ల కలిగే సగటు సంతాన ఉత్పత్తి 2.2 నుంచి 2.0కు పడిపోయినట్లు నిర్ధారించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ 4, 5వ సర్వే నివేదికల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 2.1 కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వాటిల్లో బీహార్ (2.98), మేఘాలయా(2.91), ఉత్తరప్రదేశ్(2.35), జార్ఖండ్(2.26), మణిపూర్(2.17) రాష్ట్రాలు ఉన్నాయి.
707 జిల్లాల్లోని 6.37 లక్షల శ్యాంపిల్ ఇండ్లల్లో ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వేను చేపట్టారు. గర్భనిరోధక పద్ధతుల వినియోగం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆధునిక గర్భనిరోధక విధానాలు పెరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. హాస్పిటళ్లలో ప్రసవాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రదేశాల్లో ప్రసవాలు 87 శాతం, పట్టణాల్లో 94 శాతం హాస్పిటళ్లలో జరుగుతున్నట్లు తెలిపారు.
ఎన్ఎఫ్హెచ్ఎస్-4 నివేదికతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఊబకాయ కేసులు పెరిగినట్లు తాజా రిపోర్ట్ చెబుతోంది. కేరళ, అండమాన్, ఏపీ, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, పుదుచ్చరి, పంజాబ్, చంఢీఘడ్, లక్షద్వీప్‌లో మూడవ వంతు మహిళలు ఒబెసిటీతో బాధపడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

