ఐదుగురు కొరియన్ మహిళలపై దారుణం : దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి
ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తమందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని కెమెరాలో రికార్డు చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని దోషిగా నిర్ధారించారు.
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తమందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని కెమెరాలో రికార్డు చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. 2018 జనవరి నుంచి అక్టోబర్ మధ్య పలువురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన ప్రముఖుడు, రాజకీయ నేతలతో సంబంధం ఉన్న బాలేష్ ధన్కర్ 39 ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నాడు.
బాలేష్పై అన్ని నేరారోపణలు రుజువు కావడంతో సిడ్నీలోని జిల్లా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అన్ని కేసుల్లోనూ నిందితుడిని దోషిగా కోర్టు ప్రకటించిన వెంటనే 43 ఏండ్ల డేటా నిపుణుడు బాలేష్ కోర్టు ప్రాంగణంలో కంటతడి పెట్టుకున్నాడు. మేలో మరోసారి కోర్టు ఎదుట బాలేష్ ధన్కర్ హాజరు కానుండగా ఏడాది చివరిలో అతడికి విధించే శిక్షను ఖరారు చేస్తారు. మహిళలను లోబరుచుకునేందుకు ధన్కర్ కొరియన్ ట్రాన్స్‌లేటర్లు కావాలంటూ నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేవాడు.
ఆపై వారిని సిడ్నీలోని తన స్టూడియో అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లేందుకు హోటల్, కేఫ్, కొరియన్ రెస్టారెంట్లో మహిళలతో సంప్రదింపులు జరుపుతుంటాడు. వైన్, ఇతర డ్రింక్స్‌లో మత్తు పదార్ధాలు కలిపి మహిళలకు ఆఫర్ చేసేవాడని ఆపై వారు స్ప్రహ కోల్పోగానే లైంగిక దాడికి పాల్పడేవాడని ప్రాసిక్యూటర్లు వివరించారు. నేరాన్ని రికార్డు చేసేందుకు వాడే హిడెన్ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

