న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇనియాన్.. రుజ్నా జోరా చెస్ టోర్నీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. సెర్బియా వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన ఇనియాన్ 7 పాయింట్లతో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. తొమ్మిది రౌండ్లలో ఐదు విజయాలు సాధించిన ఇనియాన్.. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించాడు.