IND vs NZ : భారత పేసర్లు షమీ, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ చెలరేగడంతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. పవర్ ప్లేలో కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లో శార్దూల్ ఓవర్లో లాథమ్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ కాన్వే(7)ను హార్ధిక్ నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. అంతకుముందు షమీ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డారెల్ మిచెల్ (1) కాటన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో సిరాజ్ నికోలస్(2)ను పెవిలియన్ పంపాడు. స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే దెబ్బ తగిలింది. షమీ ఐదో బంతికి ఫిన్ అలెన్(0)ను బౌల్డ్ చేశాడు.ప్రస్తుతం బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిఫ్స్ క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లకు కివీస్ 5 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. ఆ తర్వాతటాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.