పొట్టి సిరీస్ భారత్‌దే.. ఐదో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం

అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ సిరీస్‌ను ఘన విజయంతో ముగించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(64: 34 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్ యాదవ్(32: 17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), హార్దిక్ పాండ్య(39 నాటౌట్: 17 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ జట్టులో డేవిడ్ మలన్(68: 46 బంతుల్లో 98ఫోర్లు, 2సిక్సర్లు), జోస్ బట్లర్(52: 34 బంతుల్లో 2ఫోర్లు,4సిక్సర్లు) మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమ్ఇండియా బౌలర్లు ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టుసాధించారు. ఆఖర్లో సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటం, వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుంది. బెన్‌స్టోక్స్(14) చెలరేగా ప్రయత్నం చేసినా నటరాజన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జేసన్ రాయ్(0), జానీ బెయిర్‌స్టో(7), ఇయాన్ మోర్గాన్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/15), శార్దుల్ ఠాకూర్(3/45) గొప్పగా బౌలింగ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

