COVID-19 : దేశంలో 25వేలకు తగ్గిన కరోనా కేసులు
COVID-19 : దేశంలో 25వేలకు తగ్గిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇందులో 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు వదిలారు.
ప్రస్తుతం దేశంలో 3,69,846కి తగ్గి.. 146 రోజుల కష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. దేశంలో రికవరీ 97.51 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 1.98శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.61శాతంగా ఉందని తెలిపింది. గత 24గంటల్లో 88.13లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒకే రోజు ఇదేస్థాయిలో టీకాలు వేయడం తొలిసారని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 55.47పైగా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 49.66 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

