ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్

పుణె: ఇంగ్లాండ్‌తో నిర్ణయాక ఆఖరి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మరోసారి అదరగొట్టారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్ ధావన్(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పంత్(78: 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్ పాండ్య(64: 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో రోహిత్ శర్మ(37), ఆఖర్లో శార్దుల్ ఠాకూర్(30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు తీయగా..అదిల్ రసీద్ రెండు వికెట్లతో చెలరేగాడు.
భారత్‌కు మెరుపు శుభారంభం దక్కింది. రోహిత్-ధావన్ అదరగొడుతూ తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్, ధావన్, కోహ్లీ(7) ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ ధనాధన్ ఆటతో చెలరేగాడు. 157/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును పంత్, హార్దిక్ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన తర్వాత పంత్ గేర్ మార్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్ జోరుకు 36వ ఓవర్లో శామ్ కరన్ బ్రేక్ వేశాడు.

ఆ తర్వాత హార్దిక్ వేగంగా ఆడి హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్‌లో హార్దిక్ అవుటైనా అప్పటికే జట్టు పటిష్ఠ స్కోరుకు చేరుకుంది. ఆఖర్లో కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకూర్(30) వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 300 దాటించారు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కృనాల్ ఔటైన తర్వాత టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

