IND vs NZ | ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సుందర్.. కివీస్ స్కోర్ ఎంతంటే..?
స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. పెనర్ ఫిన్ అలెన్ (35), చాప్మన్ (0)ను ఔట్ చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్ 47/2
IND vs NZ : స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కివీస్‌ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ఐదో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ (35) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చాప్మన్ (0) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 43 పరుగలు వద్ద కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచిన ఫిన్ అలెన్ రెండో బంతికి అదే షాట్ ఆడాడు. కానీ సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో అతను ఔట్ అయ్యాడు. దాంతో, కివీస్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అలెన్ 23 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్ (29), డెవాన్ కాన్వే (5) ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ పవర్ ప్లేలో 37 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ పాండ్యా, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, మొదటి 2 ఓవర్లలోనే 23 పరుగులు వచ్చాయి. దాంతో పాండ్యా మూడో ఓవర్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను దించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

