IND vs NZ : లార్డ్స్ శార్థూల్ భారత్ బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ ఫిన్ అలెన్‌ను రెండో వికెట్‌గా వెనక్కి పంపాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా అలెన్ ఇచ్చిన క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడు షాబాజ్ అహ్మద్ ఒడిసి పట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన 11 ఓవర్లో అలెన్ చెలరేగిపోయాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దాంతో ఆ ఓవర్లో 21 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం నికోలస్, డిరిల్ మిచెల్ ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.