viral video | రెండున్నరేండ్ల తర్వాత మనవళ్లను కలిసిన తాత..!
రెండున్నరేండ్ల తర్వాత తన మనవళ్లను ఓ తాత కలుసుకున్న వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : రెండున్నరేండ్ల తర్వాత తన మనవళ్లను ఓ తాత కలుసుకున్న వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన తమ అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టగానే మనవళ్లు ఆయనను ఆప్యాయంగా చుట్టుముట్టడం ఈ షార్ట్ క్లిప్‌లో కనిపిస్తుంది.
ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 6 లక్షలుపైగా వ్యూస్ రాబట్టింది. ఈ వీడియోలో పెద్దాయన అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తుండటం చూడొచ్చు. తాత అపార్ట్మెంట్లోకి ఎంటరై ఇంట్లోకి ప్రవేశిస్తూ ఈల వేయడంతో గుర్తించిన మనవళ్లు ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు. వారు తాతను హగ్ చేసుకుని ఏడవడం అందరి హృదయాలను మెలిపెడుతుంది.
రెండున్నరేండ్ల తర్వాత మనవళ్లను కలిసిన తాత..ఫ్రంట్ డోర్ బయట ఆయన విజిల్ వేయగానే గుర్తుపట్టిన మనవళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోతో ఇన్స్టాగ్రాం యూజర్లు గతంలోకి వెళ్లి గ్రాండ్పేరెంట్స్తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రాండ్‌పేరెంట్స్ ఇప్పటికీ కలిగిఉన్నవారు అదృష్టవంతులని ఓ యూజర్ రాసుకురాగా, బ్లూషర్ట్ వేసుకున్న చిన్నారి తనను ఏడిపించాడని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
viral video | రెస్టారెంట్ నిర్వాకం : ఫ్రైడ్ చికెన్‌లో పురుగులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

