పాకిస్థాన్‌లో విధ్వంసకాండ
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ ప్రతీకారానికి దిగింది. ఒక అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు.
- ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
- ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి.. పంజాబ్‌లో 144 సెక్షన్ అమలు
- ఆర్మీ కమాండర్ ఇంటిపై రాళ్లదాడి.. పాకిస్థాన్ రేడియో భవనానికి నిప్పు
- ఇమ్రాన్‌ఖాన్‌ను గల్లా పట్టుకొని లాక్కెళ్లిన పారా మిలటరీ రేంజర్స్
- భూ బదలాయింపు కేసులో అరెస్టు..హింసించలేదు: పాక్ ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ, మే 9: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ ప్రతీకారానికి దిగింది. ఒక అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. తన భార్య బుషారా బీబీకి చెందిన అల్ ఖదీర్ అనే ట్రస్ట్‌కు రూ.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్టు ఇస్లామాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పలుచోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
పెషావర్‌లోని పాకిస్థాన్ రేడియో భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈనేపథ్యంలో పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. 144 సెక్షన్ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్‌లోని ఆర్మీ కమాండర్ ఇంటిపై ఇమ్రాన్ అనుచరులు దాడికి దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రావల్పిండి, లాహోర్, కరాచీ, గుర్జాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్లలో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
ఖజానాకు నష్టం: ప్రభుత్వం
ఇమ్రాన్‌ను హింసించామన్న ఆరోపణల్ని పాక్ ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. గతేడాది ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌పై 120కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు, ఆర్మీ కొద్ది నెలలుగా ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

