IMF On India Growth | భారత్ వృద్ధిరేటు 7.4 శాతమే.. వచ్చే ఏడాది 6.1తోనే సరి..!
IMF On India Growth | భారత్ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
IMF On India Growth | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గత ఏప్రిల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం జీడీపీ 8.2 శాతం ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయంగా అననుకూల పరిస్థితులు, పెరిగిన ధరలను నియంత్రించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపోరేట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జీడీపీ తగ్గిపోతుందని తాజా వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటుపై మరింత కోత విధించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ కేవలం 6.1 శాతానికి పరిమితం అని ఐఎంఎఫ్ వెల్లడించింది.
ఇంతకుముందు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఇండస్ట్రీ బాడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ అంచనాల్లో కోత విధించాయి. 7.5 నుంచి 7.2 శాతానికి భారత్ జీడీపీని కుదిస్తున్నట్లు గత గురువారం ఏడీబీ ప్రకటించింది. ఆహార, ఫ్యూయల్ ధరలు పెరగడం భారత వృద్ధిరేటుకు ప్రతిబంధకాలుగా మారతాయని తెలిపింది.
ఇక ఫిక్కీ మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది జీడీపీ ఏడు శాతమేనని గత గురువారం తేల్చేసింది. ఇది అంతకుముందు ఫిక్కీ అంచనా వేసిన 7.4 శాతం, ఆర్బీఐ అంచనా వేసి 7.2 శాతం కంటే తక్కువ. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రభావంతో ధరలు పెరిగిపోయి, వినియోగదారుల డిమాండ్ పడిపోతుందన్నది. గత ఆరు నెలలుగా వార్షిక వినియోగదారుల ధరల సూచీ .. ద్రవ్యోల్బణం 2-6 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం అని పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

