‘హిట్’ ఒక సీజన్‌లా మారాలి
అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు.
అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకుడు. డిసెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం దర్శకుడు రాజమౌళి అతిథిగా హైదరాబాద్‌లో జరిగింది. రాజమౌళి మాట్లాడుతూ…“హిట్’ చిత్రాన్ని సినిమాలా కాకుండా ఫ్రాంచైజీలా చేసినందుకు చిత్ర దర్శక నిర్మాతలకు అభినందనలు. ఇలా ఫ్రాంచైజీ చేయడం అంత సులువు కాదు. ఈ చిత్రానికి అడివి శేష్ ఎనర్జీని తీసుకొచ్చారు. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉంది. ‘హిట్ 3’, ‘హిట్ 4’, ‘హిట్ 5’ వరుసగా రాబోతున్నాయి. ‘హిట్’ అనేది ఒక సీజన్ కావాలి’ అన్నారు. నిర్మాత నాని మాట్లాడుతూ…‘ఈ సినిమా మీద ప్రేమ, గౌరవంతో పనిచేశాం. శేష్ మంచి నటుడు. ప్రేక్షకుల అంచనాలను తక్కువ చేయకుండా నటిస్తారు. ‘హిట్ 3’ నుంచి ‘హిట్ 7’ వరకు సినిమాలు వస్తాయి. చివరి సినిమాలో ఈ హీరోలందర్నీ కలుపుతానని శైలేష్ మాటిచ్చాడు.
ఈ చిత్రానికి ఒక నిర్మాతగా కంటే ఒక ప్రేక్షకుడిగా ఎక్కువ ఉత్సుకతతో వేచి చూస్తున్నా’ అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ…‘ఈ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. తదుపరి సినిమాలోనూ నేను ఉంటానని చెప్పడం సంతోషాన్నిచ్చింది. నా గత చిత్రాలపై ఎలాంటి నమ్మకాన్ని ఉంచి థియేటర్లకు వచ్చారో, అలాగే ఈ సినిమాకూ రండి. తప్పకుండా ఆస్వాదిస్తారు. హిందీలో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేయబోతున్నాం. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ…‘అనేక భావోద్వేగాలతో సాగే చిత్రమిది. నేను ఊహించిన ‘హిట్’ ప్రపంచం ఇవాళ నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఈ ఫ్రాంచైజీని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నం చేశాం. నాని హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించాలనేది నా డ్రీమ్. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

