రామ్ అగ్నివేష్ కథానాయకుడిగా తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకుడు. డా.అశ్వినీ నాయుడు నిర్మాత. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రాజేశ్వరి చెన్నైలో విడుదల చేశారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘యథార్థ సంఘటనను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్. ఏకకాలంలో ఐదుభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా వుంది’ అన్నారు.