హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్), పర్యావరణ పరిరక్షణలో ఆయ న అందించిన సేవలకుగాను గ్లోబల్ లీడర్‌గా గుర్తిస్తున్నట్టు ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇండోర్ ఎయిర్ ైక్లెమేట్ అండ్ క్వాలిటీ’ ప్రకటించింది.
ఈ మేరకు మంగళవారం సింగపూర్‌లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, సింగపూర్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.