Health tips | తరచూ కివీ పండును తింటే.. ఈ ఆరు ఆరోగ్య ప్రయోజనాలు మీ వెంటే..!
Health tips : పండ్లు (Fruits), కూరగాయలు (Vegetables) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals), ఫైబర్లు (Fibers) పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు (Kiwi fruits) కూడా ఒకటి. ఈ పండును తరచూ మన డైట్లో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోనాలేమిటో చూద్దాం..
Health tips : పండ్లు (Fruits), కూరగాయలు (Vegetables) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals), ఫైబర్లు (Fibers) పుష్కలంగా ఉంటాయి. అయితే మన దేహానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలా చూసుకుని డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు (Kiwi fruits) కూడా ఒకటి. ఈ పండును తరచూ మన డైట్లో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోనాలేమిటో చూద్దాం..
1. నాజూకైన చర్మం
కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. వంద గ్రాముల కివీ పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్లో అధిక శాతం లభిస్తుంది. అంతేగాక కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది. పచ్చి కివీ ముక్కలు తినడం ద్వారా గానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా గానీ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
2. అదుపులోకి బ్లడ్ ప్రెషర్
ప్రస్తుతం ఈ భూమ్మీద లక్షలాది మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారికి కివీ ఫ్రూట్ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. జీర్ణశక్తి పెరుగుదల
కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంతేగాక ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్లు సునాయాసమైన, ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి దోహదం చేస్తాయి. కివీ పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్ ఉంటుంది. దాంతో ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్గా మారుతాయి.
4. ఆరోగ్యకరమైన నిద్ర
కివీ పండులో సెరటోనిన్ వంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచి మేలు చేస్తుంది. కివీ పండులోని పదార్థాలు సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
5. రోగనిరోధక శక్తి పెంపు
ముందే చెప్పుకున్నట్టుగా సి విటమిన్‌కు కివీ పండు ఒక మంచి వనరుగా ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి నష్టం జరగకుండా కివీ పండ్లు కాపాడుతాయి.
6. పటిష్టమైన ఎముకలు
ఎముక పుష్టి ప్రస్తావన వచ్చినప్పుడు మనకు కివీ పండు అనేది అసలు స్ఫురణకే రాదు. కానీ వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టి తనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా ఉపకరిస్తుంది. అందుకే గర్భిణిల డైట్లో కివీ పండును చేర్చడం చాలా ముఖ్యం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

