వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్

వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్న చిత్రం శ్రీకారం. కిశోర్ బి డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంలో యువ నటుడు శర్వానంద్ హీరోగా నటిస్తుండగా..ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయిమాధవ్ బుర్రా కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్బంగా సాయిమాధవ్ బుర్రా కొన్ని విషయాలను పంచుకున్నాడు. శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి నేను డైలాగ్స్ రాశాను. చాలా రోజుల ఎదురుచూపు తర్వాత మరో అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా రైతుల గురించి చర్చిస్తున్న సమయం. వ్యవసాయం ఆవశ్యకతను తెలిపే కథ. ఈ సినిమా కోసం రాయడం నా బాధ్యతగా భావించాను. అంతేకాదు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఫీలయ్యారు. ఎంతో గొప్పనైన రైతు కొడుకు రైతు కావడం లేదనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు సాయిమాధవ్. వ్యవసాయం ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ వ్యవసాయం చేయకపోతే మనం తినడం మానేయాలంటూ చెప్పుకొచ్చాడు సాయిమాధవ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

