ఐజేకేతో కూటమిగా ఎన్నికల బరిలోకి: నటుడు శరత్‌కుమార్

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఇందియా జననాయగ కట్చితో (ఐజేకేతో) పొత్తుపెట్టుకుని కూటమిగా బరిలో దిగుతామని తమిళనాడుకు చెందిన పాతతరం నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) వ్యవస్థాపకుడు శరత్ కుమార్ వెల్లడించారు. మంచి పేరు, నడవడిక ఉన్న వారినే మా కూటమి తరఫున బరిలో దించుతామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు శరత్‌కుమార్ పార్టీ అధికార అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నది. అటు ఐజేకే సహవ్యవస్థాపకుడు పారివెందర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే గుర్తుతో పోటీచేసి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తాము మరికొన్ని చిన్నపార్టీలను కలుపుకునే ప్రయత్నంలో ఉన్నామని శరత్‌కుమార్ తెలిపారు. తాను కమల్ హాసన్‌ను కూడా కలిసి పొత్తు విషయమై మాట్లాడానని, తన ప్రతిపాదనపై ఎలా ముందుకు వెళ్లాలనేది వాళ్లు నిర్ణయించుకుంటారని చెప్పారు. మేం మాత్రం వారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని శరత్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

