న్యూఢిల్లీ : దివ్యాంగ బాలుడు తన చేతులను ఉపయోగించి పెయింట్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ వీడియోను షేర్ చేయగా బాలుడి స్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలుడు శ్రద్ధగా వేసిన పెయింట్ అద్భుతంగా రావడంతో అతడి నైపుణ్యాన్ని అందరూ కొనియాడారు.
हाथों का ना होना भी नन्हे बच्चे के हुनर को निखरने से नहीं रोक सका… pic.twitter.com/pWPSs0RXNC
— Dipanshu Kabra (@ipskabra) September 7, 2022
ఇతర విద్యార్ధులతో క్లాస్ రూంలో కూర్చున్న బాలుడు ట్రీకి రంగులు అద్దుతుండటం ఈ వీడియోలో కనిపించింది. తన వైకల్యాన్ని అధిగమించి బాలుడు ప్రదర్శించిన నైపుణ్యం అద్భుతమని నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో ప్రశంసలు గుప్పించారు.