నేనూ ఒకప్పుడు జర్నలిస్టునే: చీఫ్ జస్టిస్ రమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచారణలు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో జరిపే విచారణలను మీడియాకు అందుబాటులోకి తెచ్చే అప్లికేషన్ను గురువారం విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, లైవ్ విషయమై నిర్ణయం తీసుకునే ముందుగా తన సహచరుల అభిప్రాయాలు తెలుసుకుంటానని జస్టిస్ రమణ చెప్పారు. తానూ ఒకప్పుడు జర్నలిస్టునేనని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులు కోర్టు విచారణల వార్తల కోసం న్యాయవాదులపైన ఆధారపడాల్సి వస్తున్నదని చెప్పారు. అందుకే విచారణలకు జర్నలిస్టులను అనుమతించాలనే ప్రతిపాదన వచ్చిందని అన్నారు. “నేనూ కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశాను. అప్పట్లో కార్లు, బైకులు లేవు. నిర్వాహకులు సమకూర్చే వాహనాల్లో వెళ్లొద్దని పైనుంచి ఆదేశాలుండేవి. అందువల్ల మేం బస్సుల్లోనే వెళ్లేవాళ్లం” అని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రిసోర్స్ యాప్ను బాధ్యాతయుతంగా వినియోగించాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సున్నితమైనదని, తొలినాళ్ల ఉపయోగంలో కొన్ని సమస్యలూ ఉండొచ్చని చెప్పారు. చిన్నచిన్న సమస్యలు వస్తే భూతద్దంలో చూపొద్దని, సాంకేతిక బృందానికి సహకరించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

