హువావే బ్యాండ్ 6 లాంచ్..రెండు వారాలు బ్యాటరీ లైఫ్

చైనీస్ కంపెనీ హువావే సరికొత్త ఫిట్నెస్ బ్యాండ్‌ను ఆవిష్కరించింది. హువావే బ్యాండ్ 6 పేరుతో లాంచ్ చేసిన కొత్త వేరబుల్ డివైజ్‌లో డిస్ప్లేను మరింత అభివృద్ధి చేశారు. 1.47 అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లేతో విడుదలైంది. బ్యాండ్ 6 గ్రాఫైట్ బ్లాక్, అంబర్ సన్‌రైజ్, ఫారెస్ట్ గ్రీన్ కలర్లలో వస్తుంది. ఇందులో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌తో పాటు యాక్సిలెరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ వంటివి ఉన్నాయి. కొత్త ఫిట్నెస్ బ్యాండ్‌లో స్లీప్, SpO2 (బ్లడ్-ఆక్సిజన్), అలాగే స్ట్రెస్ మానిటరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
ఇందులో 5 ATM వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. బ్యాండ్‌ను సాధారణంగా వాడితే రెండు వారాల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సుమారు 96 రకాల ఎక్సర్సైజ్ మోడ్‌లను వేరబుల్ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. మలేషియాలో విడుదలైన బ్యాండ్ 6 ధర సుమారు రూ. 3,800గా నిర్ణయించారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

