అయితే.. ప్రెగ్నెన్సీ వస్తుందా?
నా వయసు ఇరవై మూడు. మావారి వయసు ఇరవై అయిదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. నోటి మాత్రలు కాకుండా వేరే గర్భనిరోధక సాధనాలు వాడుతున్నాం. అయితే, ఈ మధ్య అనుకోకుండా ఎలాంటి రక్షణా లేకుండా కలిశాం
నా వయసు ఇరవై మూడు. మావారి వయసు ఇరవై అయిదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. నోటి మాత్రలు కాకుండా వేరే గర్భనిరోధక సాధనాలు వాడుతున్నాం. అయితే, ఈ మధ్య అనుకోకుండా ఎలాంటి రక్షణా లేకుండా కలిశాం. అదీ నా నెలసరి అయిన వారం రోజులకే. దీంతో ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని కంగారుగా ఉంది. గర్భాన్ని నిర్ధారించుకోవాలంటే ఎన్ని వారాలు ఆగాలి. ఏ పరీక్షలు చేయించుకోవాలి?
– ఓ సోదరి
సాధారణంగా నెలసరి వచ్చిన పది నుంచి ఇరవై రోజుల మధ్య కలిస్తే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదనే చెప్పాలి. అయితే, గర్భం ఏ రోజుల్లో రావచ్చు అన్నది మీ పీరియడ్ సైకిల్ ఎన్ని రోజులది అన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది తెలిస్తేగానీ కచ్చితంగా ఏ రోజుల్లో గర్భం ధరించే ఆస్కారం ఉంటుందన్నది అంచనా వేయలేం. ఇక, మీరు అడిగినట్టు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందా? అనే విషయం తెలుసుకోవడానికి మరీ ఎక్కువ రోజులు ఆగాల్సిన పన్లేదు. మీ నెలసరి తేదీ వచ్చినా పీరియడ్స్ రాకపోతే.. వారం రోజుల తర్వాత సీరం బీటా హెచ్‌సీజీ అనే రక్త పరీక్ష చేయించుకోండి. వెంటనే ఫలితం తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా గర్భస్థ పిండం కచ్చితమైన వయసు కనుక్కొనే అవకాశమూ ఉంటుంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- early
- Health
- Menstruation
- pregnancy
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

